‘తెలంగాణ గర్జన’ కు పారిశుధ్య కార్మికుల చేతుల మీదుగా శ్రీకారం…
‘సెప్టెంబర్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 14వ వర్ధంతి రోజు ‘తెలంగాణ గర్జన’ తెలుగు దినపత్రిక టైటిల్ మరియు సెప్టెంబర్ 27వ తేదీ కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినం సందర్బంగా అధికారికంగా పత్రిక ప్రారంభిస్తున్నట్లు తెలిపే పోస్టర్ ను అప్పారెడ్డిపల్లి గ్రామ పారిశుధ్య కార్మికుల చేత ఆవిష్కరింప చేసి ప్రకటించటం జరిగింది. పారిశుధ్య కార్మికులు గ్రామంలో చెత్తను శుభ్రం చేసి గ్రామ ఆరోగ్యాన్ని కాపాడినట్లు తెలంగాణ గర్జన దినపత్రిక సమాజం లోని చెత్తను శుభ్రం చేయటంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని ఆ సందర్బంగా ప్రకటించటం జరిగింది –
ఎడిటర్ : గోవిందు శ్రీధర్




