డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా కల్వకుర్తిలో క్రికెట్ టోర్నమెంట్

ఈ వార్తను షేర్ చేయండి:

కల్వకుర్తి,నవంబర్ 9(తెలంగాణ గర్జన): ఈ నెల నవంబర్ 23న మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ ఏడీజీపీ, స్వేరోస్ నెట్‌వర్క్ చైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ‘ప్రతిజ్ఞ దివస్’ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల నవంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు కల్వకుర్తి లో జరగనున్న ఈ క్రీడా పోటీల్లో నియోజకవర్గ పరిధిలోని క్రికెట్ జట్లు పాల్గొననున్నాయి. నవంబర్ 21న నిర్వహించనున్న ఫైనల్ మ్యాచ్‌కు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని అలవర్చడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. క్రీడల ద్వారా యువతను సంఘటితం చేసి, వారిలో సామాజిక బాధ్యత పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలను ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అశ్విన్ కుమార్, మేనేజర్ మరియు ఈవెంట్ కోఆర్డినేటర్ రాము, బోర్డు సభ్యులు బండగళ్ల చందు, కొమ్ము కిరణ్ కుమార్, దోబ్బల భాస్కర్, కొప్పు మహేష్, సభ్యుడు వసుపుల శ్రీకాంత్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని, టోర్నమెంట్ లో పాల్గొనదలుచుకున్న టీంలు 9014529890 ని సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *