ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
మాడ్గుల,నవంబర్ 09( తెలంగాణ గర్జన):మాడ్గుల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రేవంత్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేవంత్ మిత్ర మండలి అధ్యక్షుడు జింకల భాస్కర్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ రజిత దేవయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ రజిత దేవయ్య గౌడ్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు, మండలి సభ్యులు, గ్రామస్తులు కలిసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మాజీ ఉపసర్పంచ్ అన్నేపాక(మిద్దె) రాములు, అరవింద్ గౌడ్, మొక్తాల కృష్ణయ్య, ముద్దం కృష్ణ,గ్రామస్తులు,రేవంత్ మిత్ర మండలి సభ్యులు,స్థానిక నాయకులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




