రాహుల్ గాంధీకి ఒక న్యాయం, బిఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయమా? – డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ ద్వంద్వ నీతి
హైదరాబాద్, అక్టోబర్ 10 (తెలంగాణ గర్జన): కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, అయితే నిరసనలను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేటు వద్ద విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్కు చేతులెత్తి దండం పెట్టి, పక్కకు జరగాలని విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ను రాహుల్ గాంధీ నెట్టిన ఘటనపై కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విషయంలో ఒక విధంగా, రాహుల్ గాంధీ విషయంలో మరో విధంగా వ్యవహరించడం ఏమిటని ఆయన విమర్శించారు.
మహిళా పోలీసులకు సంబంధించిన ఘటనలపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో ఆరోపించారు.
@TelanganaDGP @TelanganaCOPs @RahulGandhi @revanth_anumula @BRSHarish @KTRBRS @RahulGandhi @NaveenReddyMLC @D_SudheerReddy
#ElCongo #TelanganaSinking


