విద్యార్థుల తాగునీటి సమస్యకు వారంలోగా పరిష్కారం

ఈ వార్తను షేర్ చేయండి:
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • కమ్మదనం గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కేశంపేట్,సెప్టెంబర్ 29 ( తెలంగాణ గర్జన): ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శారదతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులు, పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వారం రోజుల్లోగా విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం నీటి ట్యాంకును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలోని ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్మగళ్ల రమేష్, వెలిజర్ల గ్రామ సర్పంచ్ ఆర్. బాబు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్, గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనునాయక్, ఎస్సీ విభాగం నేత జాంగారి రవి, కాంగ్రెస్ నేతలు మాధవులు యాదవ్, గణేష్ నాయక్, జాంగారి జంగయ్య, కుమార్ నాయక్, మేగ్య నాయక్, రాజు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *