ఎంబిబిఎస్ లో సీటు సాధించిన గిరిజన విద్యార్థిని
హర్షం వ్యక్తం చేసిన జైరాం తండా వాసులు
మాడ్గుల సెప్టెంబర్27 (తెలంగాణ గర్జన) మాడుగుల మండలంలోని పడమటి తండా గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని జటావత్ వైష్ణవి ఎంబిబిఎస్ లో 450 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ లోని గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు ఎంపిక అయినట్లు తండావాసులు తెలిపారు. వైష్ణవి తల్లిదండ్రులు జనావత్ నీలబిక్యానాయక్ కూతుర్ని డాక్టర్ చేయాలనే లక్ష్యంతో చిన్నప్పటి నుంచే మంచి విద్యను అందించి ఇంటర్మీడియట్ లో శ్రీ చైతన్య కళాశాల ఎల్బీనగర్ బ్రాంచ్ లో చదివించగా ఎంబిబిఎస్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించి డాక్టర్ సీట్ సాధించడం పట్ల పడమటి తండా మరియు అమ్మమ్మ ఊరు అయినా జై రాం తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. జైరాం తండా మాజీ సర్పంచ్ రూప దేవిలాల్, వార్డు సభ్యురాలు సుమలత రఘునాయక్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.




