డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు అవగాహన
వెల్దండ, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): కుప్పగాండ్ల గ్రామంలో సోమవారం రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి హబీబున్నిసా పంటల డిజిటల్ సర్వే పై రైతులకు అవగాహన కల్పించారు. సర్వే ప్రాముఖ్యతను వివరించారు. రైతులు తమ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు వివరాలతో గ్రామ వాలంటీర్ల దగ్గర పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. డిజిటల్ సర్వే ప్రక్రియలో రైతులు తప్పనిసరిగా పాల్గొని అధికారులకు సహకరించాలని కోరారు.

డిజిటల్ క్రాప్ సర్వేలో పంట నమోదు చేసుకున్నప్పుడే భవిష్యత్తులో మీరు పండించిన పంటను విక్రయించడానికి అవసరమైన ప్రక్రియలు సులభంగా జరుగుతాయి.
కావున ప్రతి రైతు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసుకోవడానికి DCS వాలంటీర్లు (మెరుగు అనిల్ , శెట్టిగారి సర్వేశ్వర్) మీ పొలానికి వచ్చినప్పుడు వారికి సహకరించి, మీ పంట వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని
రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ ఇ ఓ కోరారు.




