నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన

ఈ వార్తను షేర్ చేయండి:

అమనగల్, సెప్టెంబర్ 28 ( తెలంగాణ గర్జన): నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అమనగల్ మండల స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమo, ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి అవగాహన కల్పించారు. డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంపై వాటి ప్రభావం, కుటుంబం మరియు సమాజంపై పడే ప్రతికూల పరిణామాలను వివరించారు.

యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, వాటి వినియోగాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డా.మైమూనా బేగం, డా కార్తీక్ ఆర్బీఎస్కే టీం – బి, వెంకటేశ్వర్లు సీఐ, రాఘవేంద్రరెడ్డి మున్సిపల్ కమిషనర్, మాధవ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పాండు జెడ్పీహెచ్ఎ స్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుపతి రెడ్డి హెచ్ ఈ ఓ , కృపమ్మ పి హెచ్ న్ ,ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *