పారిశుధ్య నిర్వహణలో చొరవ చూపిన హనుమాన్ ప్రసాద్‌కు ఘన సన్మానం

ఈ వార్తను షేర్ చేయండి:

చౌటుప్పల్, సెప్టెంబర్ 30 (తెలంగాణ గర్జన): మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చడంలో ప్రత్యేక చొరవ చూపిన సానిటరీ ఇన్‌స్పెక్టర్ కంది హనుమాన్ ప్రసాద్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఘనంగా సన్మానించారు.

పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన పారిశ్రామిక కార్మికులను గుర్తించి పెనాల్టీలు విధించడంలో హనుమాన్ ప్రసాద్ చొరవ చూపారని వారు అభినందించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆయన కీలకంగా వ్యవహరించారని తెలిపారు.

పట్టణంలో పరిశుభ్రత, పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని చైర్‌పర్సన్, కమిషనర్ సూచించారు.

ఈ సందర్భంగా హనుమాన్ ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *