వైద్యుడి విధులు ఎక్కడ?

ఈ వార్తను షేర్ చేయండి:

తెరుచుకోని ఇర్విన్ ఆయుర్వేద వైద్యశాల..

మాడ్గుల,సెప్టెంబర్ 27 (తెలంగాణ గర్జన):మాడ్గుల మండల పరిధిలోని ఇర్విన్ గ్రామంలో ఆయుర్వేద వైద్యశాల ఉన్నప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుడు ఉన్నప్పటికీ వైద్యశాల తెరుచుకోకపోవడంతో ముఖ్యంగా వయోవృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొంటున్నారు.ఇర్విన్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఈ ఆయుర్వేద వైద్యశాల సక్రమంగా పనిచేస్తే స్థానికంగానే వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. వైద్యుడు ఉన్నప్పటికీ వైద్యశాల తెరుచుకోకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వృద్ధులు,పేదలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వైద్యశాలను క్రమం తప్పకుండా తెరిచి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.వైద్యుడు అందుబాటులో ఉన్నప్పుడు వైద్యశాల ఎందుకు తెరుచుకోవడం లేదని ప్రశ్నిస్తూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించి ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇర్విన్,పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మండల ప్రజలు వేచి చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *