ఈ నెల 29 న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
ఆమనగల్లు, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన)ఈనెల 29వ తేదీ నుంచి వివిధ పాఠశాలలలోనీ విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి చూపు మందగించిన వారికి క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ పి ఆర్ ఓ ఎం ఏ పాష తెలిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కంటి వైద్యులు ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కంటి పరీక్షలు నిర్వహించి క్లబ్ సభ్యుల సహకారంతో కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ అవకాశాన్ని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.




