మహిళా సాధికారతే లక్ష్యం.. ఆర్థిక స్వావలంబన దిశగా దాసరి ఉషక్క చొరవ

ఈ వార్తను షేర్ చేయండి:
  • పెద్దపల్లి తిలక్‌నగర్‌లో మహిళలతో దాసరి ఉషక్క సమావేశం

పెద్దపల్లి, సెప్టెంబర్ 28 ( తెలంగాణ గర్జన)పెద్దపల్లి పట్టణంలోని తిలక్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నాయకురాలు, పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషక్క మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళల సమస్యలు, వారి ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహిళలకు అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ఉషక్క సూచించారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంపై సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో తిలక్‌నగర్‌కు చెందిన పలువురు మహిళలు పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *