ఆకుతోటపల్లిలో మైనింగ్ వ్యతిరేక పోరు.. 8వ రోజుకు చేరిన దీక్ష
- క్రషర్ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ అధికారికి వినతి
ఆమనగల్లు, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): ఆకుతోటపల్లి గ్రామంలో మైనింగ్, స్టోన్ క్రషర్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో భాగంగా మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ఎదుట 8వ రోజు దీక్ష కొనసాగింది. గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొని క్రషర్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, క్రషర్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని దీక్షలో పాల్గొన్న వారు విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో కంబాలపల్లి విజయ్, చందర్, కంబాలపల్లి బాలు (వార్డు సభ్యుడు), కంబాలపల్లి రాజరత్నం, ఊరడి శేఖర్, పెరుమళ్ళ వెంకటయ్య, కంబాలపల్లి రాములు పాల్గొన్నారు.
అధికారికి వినతిపత్రం
మైనింగ్, క్రషర్ కార్యకలాపాల వల్ల గ్రామంలో దుమ్ము, ధూళి కాలుష్యం, శబ్ద కాలుష్యం, భారీ వాహనాల రాకపోకలు, రహదారుల దెబ్బతినడం, వ్యవసాయంపై ప్రభావం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంటూ మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. క్రషర్కు సంబంధించిన అనుమతులు, నిబంధనల అమలు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పోరాటానికి పలువురి మద్దతు
క్రషర్ వ్యతిరేక పోరాటానికి శ్రీపాతి శశిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, గురిగల్ల రూఫుస్, నోబెల్, కంబాలపల్లి ప్రమోద్‌కుమార్, కంబాలపల్లి రాంచంద్రయ్య, అనిల్‌కుమార్, కంబాలపల్లి శ్రీను, కంబాలపల్లి పర్వతాలు, ఊరడి బలరాం, శేఖర్, వల్లపుదాసు వీరేష్‌గౌడ్, వల్లపుదాసు తిరుపయ్యగౌడ్, వోటికోట కృష్ణ, షేక్ సాజిద్, దొడ్డమోని కృషయ్య, డేవిడ్, చందు, శివాజీ, కిరణ్, ప్రవీణ్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తమ మద్దతు ప్రకటించారు.




